టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్… తను చేసిన సినిమాలు దాదాపు సూపర్ హిట్స్ అవడంతో దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి వెళ్ళింది. అయితే బాలీవుడ్ మీద ప్రేమతో తెలుగు సినిమాలని సైడ్ చేసింది, దానితో పాటు తను నటించిన గత కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో మన మేకర్స్ కూడా రకుల్ ని లైట్ తీసుకున్నారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ సినిమాలు కూడా నిరాశపరచడంతో హిందీలో రకుల్ కి అవకాశాలు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని రకుల్, మళ్ళీ తెలుగు సినిమాలపై ద్రుష్టి పెట్టింది కానీ ముందులా ఆఫర్స్ వచ్చే ఛాన్సులు లేకపోవడంతో తన రెమ్యునరేషన్ బాగా తగ్గించి నటించడానికి కూడా సిద్దమయ్యింది. దీంతో అమ్మడి చేతికి వెంకటేష్-నాగ చైతన్య నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా వెంకీ మామనే, ఇది ఆడితే పర్లేదు కానీ ఈ చిత్రం కూడా నిరాశ పరిస్తే రకుల్ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్లే.