రకుల్‌కు గత ఏడాది పెద్దగా కలిసి రాలేదు. అవకాశాలు బాగానే వచ్చినా..సక్సెస్ మాత్రం దక్కలేదు. దీన్ని బేస్ చేసుకుని ఈ ఏడాది ఆమెకు అవకాశాలు రావేమో అని అనుకున్నారు. కానీ రకుల్ మాత్రం మంచి అవకాశాలే అందుకుంది. నాగార్జునతో `మన్మథుడు 2`లో నటిస్తుంది. హిందీలో నటించిన `దే దే ప్యార్ దే` రకుల్‌కు చాలా మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ అమ్మడుకి కోలీవుడ్‌లో ఓ భారీ ఆఫర్ వచ్చిందట. వివరాల్లోకెళ్తే.. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 64 వ చిత్రం.. త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. లొకేష్ కనకరాజ్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో ముందుగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో రకుల్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. అన్ని అనుకున్నట్లు కుదిరితే గత ఏడాది సూర్య, కార్తిలతో నటించిన రకుల్‌కు మరో బ్రేక్ దక్కినట్టేనని అంటున్నారు.
previous post
next post