Rakul Preet Singh: వేషాలకోసం అడ్డమైన పనులు చేయనంటున్న రకుల్ ప్రీత్!

Share

Tollywood: రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగునాట క్రేజ్ హీరోయిన్లలో ఈమె ఒకరు. అందంతోపాటుగా అభినయం ఈమె సొంతం. ఆమధ్య రిలీజైన ‘కొండపొలం’ సినిమా టాక్ ఎలా వున్నా, రకుల్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈమె ఫిట్‌నెస్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికినా రకుల్ జిమ్ లోనే సమయం గడుపుతుంది. అందుకే మూడు ప‌దులు వ‌య‌సు దాటినా మతిపోయే గ్లామ‌ర్ ఆమె సొంతం. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆమె చేయని పాత్రల గురించి వివరించింది.

రకుల్ ఏం చెప్పారు?

పాత్ర డిమాండ్ ను బట్టి బ‌రువు పెర‌గాల‌న‌డం, త‌గ్గాల‌నడం అనే విషయాలు ఆమెకి ఎంతమాత్రం నచ్చవట. ఎందుకంటే మామ్మూలుగానే ఫిట్ నెస్ అంటే ప్రాణం పెట్టే అమ్మడుకి ఇలాంటివి చేస్తే తరువాత కాలంలో విపరీతమైన హెల్త్ సమస్యలు వస్తాయని చెబుతోంది. వెంట‌నే బ‌రువు పెర‌గ‌డం, ఆ వెంట‌నే బ‌రువు త‌గ్గ‌డం అనేవి శారీరకంగా అంత మంచిది కాదని రకుల్ చెబుతోంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, అలా బరువు త‌గ్గడం లాంటి పాత్ర‌లు చేయ‌మ‌ని తనని ఇంతవరకు ఎవరూ అడగలేదట!

రకుల్ బిజినెస్ వివరాలు:

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఘన విజయం తరువాత ఆమె శ‌ర‌వేగంగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో న‌టించారు. ఇక ఈమె మంచి వ్యాపారవేత్త కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా ఉన్నారు ర‌కుల్‌. ప్రస్తుతం ఎఫ్ 45 అనే జిమ్ సెంట‌ర్‌ను ర‌కుల్ నిర్వ‌హిస్తున్నారు. అమ్మడుకి వీలు చిక్కినప్పుడల్లా సోష‌ల్ మీడియాలో ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ మంచి యాక్టివ్‌గా వుంటారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

15 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

18 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago