Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `గిల్లీ` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. `కెరటం` తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే తాను బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో సీక్రెట్ డేటింగ్ చేసిన ఈ జంట గత ఏడాది తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు. వీరి ప్రేమ విషయం బయటకు వచ్చాక త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు.
కానీ, పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే చెప్పేసింది. ఇకపోతే ప్రస్తుతం రకుల్ ప్రియుడితో ఆగ్రాలో షికార్లు కొడుతోంది. `దే దే ప్యార్ దే దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరు అయ్యేందుకే రకుల్-జాకీలు అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ప్రేమ పక్షలు ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ను సందర్శించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రకుల్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె సినిమాలేమి చేయపోయినా హిందీలో మాత్రం ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండెరెల్లా చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళ్, కన్నడ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్‌కు ఈ బ్యూటీ సైన్ చేసింది.
https://www.instagram.com/reel/CaMLviqAsQm/?utm_source=ig_web_copy_link