సినిమా

Rakul: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌కుల్.. ఏకంగా ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్‌?!

Share

Rakul: ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఢిల్లీకి చెందిన ర‌కుల్ `కేరటం` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ ఇక్క‌డ స్టార్ హోదాను ద‌క్కించుకున్న ర‌కుల్‌.. ప్ర‌స్తుతం సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తూ మ‌స్తు బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిల్ కుమార్ సినిమాలోనే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాన్ని అందుకుందీ బ్యూటీ. బోనీ కపూర్‌ నిర్మాతగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో నేర్కొండ పార్వై చిత్రంలో నటించారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వెంటనే ఇదే కాంబినేషన్‌లో `వలిమై` చిత్రం చేశాడు.

Rakul preeth singh : రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో మరో సినిమాలో ఛాన్స్... ఇప్పట్లో తెలుగు సినిమాకి సైన్ చేయదేమో ..?

ఈ సినిమా అనుక‌న్న స్థాయిలో హిట్ అవ్వ‌క‌పోయినా.. అజిల్ మ‌ళ్లీ హెచ్‌. వినోద్‌తోనే మ‌రో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. `AK 61` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం హైదరాబాద్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను సంప్ర‌దించాట‌. స్టోరీ లైన్ బాగుండ‌టం, త‌న పాత్ర‌కు మంచి ప్రాధ‌న్య‌త ఉండ‌టంతో.. ర‌కుల్ వెంట‌నే అజిత్ సినిమాకే ఓకే చెప్పేసింద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

 


Share

Related posts

Anchors: స్మాల్ స్కీన్ టు సిల్వ స్కీన్..గ్లామర్ ట్రీట్ ఇస్తున్న యాంకర్స్..

GRK

Devatha Serial: సత్యకు పిల్లలు పుట్టారని తేల్చి చెప్పిన ఆదిత్య..! దేవి తన కన్న కూతురని సూరి చెప్పేస్తాడా..!?

bharani jella

షాకిలిస్తున్న సర్కారు వారి పాట.. ఉన్నపలంగా ఇంతపెద్ద ఛేంజ్ అంటే ఫ్యాన్స్ కి కంగారు వస్తుందేమో ..?

GRK