సినిమా

Rakul Preeth singh: రకుల్ బాలీవుడ్‌లో సెటిలైంది..టాలీవుడ్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా..?

Share

Rakul Preeth singh: ఒకప్పుడు టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కెరటం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ సినిమా పర్ఫార్మెన్స్ పరంగా రకుల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన రారండోయ్ వేడుక చూద్దాం..సూపర్ హిట్‌గా నిలిచిది. దాంతో రకుల్ లక్కీ లేడీ అయిపోయింది. వరుసగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, గోపీచంద్, మహేశ్ బాబు లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది.

rakul-preeth-singh-setteled in bollywood
rakul-preeth-singh-setteled in bollywood

వీరితో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అల్లు అర్జున్ సరసన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత చేసిన జయజానకి నాయక, కిక్ 2 లాంటి సినిమాలతో ఫ్లాప్స్ కూడా చూసింది. మహేశ్ బాబుతో చేసిన స్పైడర్ పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత అవకాశాలు రాక నాగార్జున సరసన మన్మధుడు 2 చేసింది. ఈ సినిమా పెద్ద రాంగ్ ఛాయిస్. ఇక టాలీవుడ్‌లో రకుల్ కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమా అవకాశం అందుకుంది. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ కావడంతో మళ్ళీ రకుల్ గేర్ మారుస్తుందనుకున్నారు.

Rakul Preeth singh: మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటుందా ..?

కానీ, కొండపొలం ఫ్లాప్‌గా మిగిలింది. అంతే, మళ్ళీ ఇక్కడ ఎవరూ రకుల్‌ను పట్టించుకుంది లేదు. అయితే, తనకు బాలీవుడ్‌లో మాత్రం సాలీడ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలున్నాయి. అక్కడ రకుల్ కోసం మేకర్స్ బాగానే క్యూ కడుతున్నారు. మంచి రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. పాన్ ఇండియన్ హీరోయిన్ పూజా హెగ్డే, కియారా, రష్మికల కంటే కూడా రకుల్ చేతిలోనే ఎక్కువ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి అక్కడ సాలీడ్ రెండు అందుకొని మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటుందా లేదా కాలమే నిర్ణయించాలి.


Share

Related posts

YS Jagan: వైజాగ్ ద‌శ మారిపోయే నిర్ణ‌యం తీసుకున్న వైఎస్ జ‌గ‌న్‌

sridhar

శంకర్ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్?

Siva Prasad

Salaar: సలార్ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ..ఇది పక్కా పాన్ వరల్డ్ సినిమా

GRK