రోడ్డుపైన వెళ్తున్నప్పుడు నలుగురు నానారకాలుగా మాట్లాడుతుంటారు, అందరి మాటలు పట్టించుకోని వారికి స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరి మాటలైనా నొప్పించి తప్పనిసరిగా స్పందించాల్సి వస్తే దానికో హద్దు ఉంటుంది, ఈ హద్దులు మర్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఒక నెటిజెన్ ని తీవ్రంగా విమర్శలు చేసింది.
రీసెంట్ గా రకుల్ సోషల్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ట్రెండ్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యే రకుల్, ఈ లేటెస్ట్ ఫొటోల్లో జీన్స్ షర్ట్, మినీ షార్ట్స్ లో ఉంది. బాటమ్ మరీ షార్ట్ గా ఉండడం, దాన్ని కాస్త హ్యాండ్ బ్యాగ్ కవర్ చేయడంతో… ఈ ఫోటో చూసిన వాళ్లలో ఒక నెటిజెన్ కాస్త హద్దు దాటి ‘రకుల్ ప్రీత్ సింగ్ కార్ లో ఒక సెషన్ పూర్తి చేసుకొని ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది’ అని కామెంట్ చేశాడు. ఈ మాటకి రకుల్ మనోభావాలు దెబ్బతిని బాగా కోపం వచ్చినట్లుంది, ‘ఈ సెషన్స్ మీ అమ్మ చేస్తుందేమో అందుకే నీకు అంతబాగా తెలిసినట్లుంది’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.
తన స్వాభిమానం దగ్గరికి వచ్చినప్పుడు రకుల్ స్పదించడంలో తప్పు లేదు కానీ ఒక వ్యక్తి చేసిన తప్పుకి, అతని అమ్మని విమర్శించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ నెటిజెన్స్ రకుల్ ప్రీత్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకి కూడా బదులిచ్చిన రకుల్, మీ లాంటి వాళ్లందరూ అడ్డవాళ్లని కామెంట్స్ చేసే సమయంలో ఎక్కడిపోతారు, ఆ అబ్బాయి అన్న మాటలు వాళ్ల అమ్మ వరకూ వెళ్లి, అతని చంప చెళ్లుమనిపించాలని కోరుకుంటున్నాని చెప్పింది. ఆడవారి వస్త్రధారణ, వేషధారణ గురించి మాట్లాడే వాళ్లు ఉన్నన్ని రోజులు అమ్మాయిలపై అన్యాయాలు ఆగవని రకుల్ చెప్తున్న మాటల్లో నిజముంది కానీ ఒక వ్యక్తి చేసిన తప్పుకి, అతని అమ్మని అనడం ఎంత వరకూ కరెక్ట్ అనేది మాత్రం రకుల్ ప్రీత్ కే తెలియాలి.