Ram Charan: మూడు భాషలలో రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ ప్రతిష్టాత్మక సినిమా..!!

Share

Ram Charan: చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రామ్ చరణ్ తేజ్ అతి తక్కువ టైమ్ లోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రెండో సినిమా “మగధీర” తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి.. తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తూ హీరోగా మెగా అభిమానులను అలరిస్తు.. మరోపక్క నిర్మాతగా కూడా తండ్రి చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్నారు. అంతమాత్రమే కాకుండా మెగా హీరోలకు సంబంధించి చాలా విషయాలలో చొరవ తీసు కుంటూ మరోపక్క మెగా అభిమానుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ.. మెగా కాంపౌండ్ కి పెద్ద ఎస్సెట్ గా రామ్ చరణ్ రాణిస్తున్నారు.

rc15 - Twitter Search

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలసి “RRR” లో నటించడం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కావడంతో పాటు చివరి ప్రమోషనల్ సాంగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో… దాని షూట్ లో చెర్రీ పాల్గొంటున్నాడు. ఇలా ఉంటే తన కెరీర్ లో 15వ సినిమా సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాగా ఈ మూవీని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాని మూడు భాషల్లో రిలీజ్ చేయాలని తాజాగా ఈ సినిమా యూనిట్ భావించడం జరిగింది అని ఫిలిం వర్గాలు అంటున్నాయి.

Read More: #RC15: అఫిషియల్: రామ్ చరణ్ సినిమాకి తమన్ బాణీలు..!!

విషయంలోకి వెళితే తెలుగు, తమిళ్ తో పాటు హిందీ భాషలలో రిలీజ్ చేయాలని.. ఆ తర్వాత కుదిరితే ఇంకా షూటింగ్ జరుగుతున్న టైం లో వేరే భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఈ మూడు భాషలను దృష్టిలో పెట్టుకుని శంకర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Share

Related posts

రాజకీయ మాటల మాంత్రికుడు కేసీఆర్!ఏ ఒక్క పాయింట్ నూ వదల్లే!

Yandamuri

ఈ ఒక్క ‘టీ’ చాలు చాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది

Teja

ఇక ఎయిర్‌బస్‌లు దిగుతాయి

somaraju sharma