జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తనదైన పంథాలో అందరినీ ఆకట్టుకునేలా పవన్ ప్రచారం సాగిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు… జనసేన పార్టీ నుండి నరసాపురం స్థానానికి లోక్‌సభ అభ్యర్థిగా పోటీలో ఉన్న పంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో .. ఈరోజు మెగా ఫ్యామిలీ నుండి పవన్‌కు కంగ్రాట్స్ చెబుతూ అబ్బాయి చరణ్ తన ఫేస్బుక్ పేజీలో మెసేజ్ పోస్ట్ చేయడం విశేషం. జనసేన మ్యానిఫెస్టో గురించి తన మెసేజ్‌లో చరణ్ ప్రస్తావించారు. “అద్భుతమైన మ్యానిఫెస్టో. సమాజంలో అందరికీ న్యాయం చేస్తుంది. రాజకీయాల్లో ఇదొక సరికొత్త పంథా. కల్యాణ్ బాబాయికి కంగ్రాట్స్. జనసేన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్“ అని పేర్కొన్న రాంచరణ్ ఓట్ ఫర్ గ్లాస్.. జనసేన రివల్యూషన్ 2019 హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు. ప్రస్తుతం `RRR` షూటింగ్లో గాయపడిన చరణ్ మూడు వారాలు విశ్రాంతిలో ఉన్నారు.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!