Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు మూడేళ్ల తర్వాత `ఆర్ఆర్ఆర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించాడు. అలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఈ పీరియాడిక్ ఫిక్షన్ స్టోరీ నేడు భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్బ్ అంటున్నారు. మరోవైపు సెలబ్రెటీలు సైతం ఆర్ఆర్ఆర్పై సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ బాక్సింగ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా చిన్నది. అయితే ఈ చిన్న సీన్ కోసం చరణ్ ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నాడు. చరణ్‌కు బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చిన నీరజ్ గోయత్ అనే వ్యక్తి ఈ విషయాన్నే తెలుపుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.
`ఆర్ఆర్ఆర్ సినిమాలో బాక్సింగ్ సెగ్మెంట్ చిన్నదే. అయినా కూడా నా బ్రదర్ రామ్ చరణ్ తన దగ్గర శిక్షణ తీసుకున్నాడు.. చెమటలు చిందేలా ప్రాక్టీస్ చేశాడు. ప్రాణం పెట్టి నటించి అందరినీ మిస్మరైజ్ చేశాడు` అంటూ నీరజ్ ట్విట్టర్లో రాసుకొచ్చాయి. దీంతో ఇతను పోస్ట్ చేసి వీడియో మెగా అభిమానులతో పాటు నెటిజన్లను సైతం ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది. ఏదేమైనా ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే.
#RRR Movie have small segment of boxing & my Brother @AlwaysRamCharan have trained really hard with me even for that small segment.he has put his sweat and soul and given power pack performance.@RRRMovie @DVVMovies @ssrajamouli pic.twitter.com/O2SIq5XZiV
— Neeraj Goyat (@GoyatNeeraj) March 25, 2022