Ori Devudaa: మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత సినిమా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఓటిటి రంగం పుంజుకోవడంతో థియేటర్లలో సినిమా కొద్దిరోజులే ప్రదర్శతమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి సినిమా విజయాన్ని మరొక హీరోలు పొగుడుతూ తమ వంతు పబ్లిసిటీ అందిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఒకరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి మరొక హీరోలు వస్తూ తమ వంతు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ తరహాలోనే ఇండస్ట్రీలో అనేక సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు.. పలు హీరోలు రావటం జరిగింది.
చిన్న సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. “సీతారామమ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రభాస్ రాగా శ్రీ విష్ణు నటించిన “అల్లూరి” సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఇంకా కుర్ర హీరో విశ్వక్ సేన్ కలిసి నటించిన “ఓరీ దేవుడా” ప్రీ రిలీజ్ వేడుకకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరవుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలో ఈరోజు రాజమండ్రిలో జరగబోయే “ఓరీ దేవుడా” ప్రీ రిలీజ్ వేడుకకి చరణ్ వస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ పరంగా విశ్వక్ సేన్ … ఇంకా వెంకటేష్ ట్రైలర్ లో ఇరగదీస్తున్నారు. యశ్వంత్ మరి ముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించడం జరిగింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!