Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నరు. వరుస విజయాలతో నటనపరంగా అన్ని రకాలుగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR”తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ గా నిలిచాడు. రామరాజు పాత్రలో చరణ్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. యాక్షన్ పరంగా ఫైట్స్ పరంగా చిరంజీవి తల ఎత్తుకునే రీతిలో చరణ్ కెరియర్ కొనసాగుతూ ఉంది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
ఈ క్రమంలో వరల్డ్ వైడ్ క్రేజ్ కలిగిన చరణ్ ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన తర్వాత అతి తక్కువ టైంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా చెర్రీ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. “RRR”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో… చరణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకేకుతున్న ఈ మూవీలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రాజమహేంద్రవరంలో జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటించే యోచనలో మేకర్స్ ఉన్నారు. “RRR” తర్వాత శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.