తండ్రితో నాలుగోసారి

Share

మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ సినిమా కోసం రంగం సిద్దం చేస్తున్నారు. మెసేజ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన కొర‌టాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 22న ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం సెప్టెంబ‌ర్ చివ‌ర్లో లేదా అక్టోబర్‌లో ప్రారంభం కావ‌చ్చు. ఈ సినిమాలో మెగాస్టార్‌తో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ, ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాల్లో చిరు, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. అన్ని స‌వ్యంగా జ‌రిగితే నాలుగోసారి చిరు, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి తెర‌పై క‌న‌ప‌డ‌తార‌ట‌. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజన్‌రెడ్డి క‌లిసి నిర్మించ‌నున్నారు.


Share

Related posts

‘మన్మథుడు 2’ కథ ఇదేనా!

Siva Prasad

దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌

Siva Prasad

రవిబాబు కొత్త చిత్రం ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల…

Siva Prasad

Leave a Comment