Unstoppable 2: ఆహా ఓటిటి “అన్ స్టాపబుల్” టాకీ షోకి భారీ క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ షోకి సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా వస్తున్నారు. మొదటి సీజన్ లో కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే వచ్చారు. కానీ రెండవ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ నేతలు వస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా “అన్ స్టాపబుల్” నిలిచింది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కి మంచి క్రేజ్ రావడంతో రెండవ సీజన్ లో చాలామంది పెద్దపెద్ద స్టార్స్ వస్తూ ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ పార్ట్ అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ రామ్ చరణ్ కి ఫోన్ చేయడం తెలిసిందే. ఈ సమయంలో బాలకృష్ణతో చరణ్ సంభాషణ చాలా హైలెట్ అయింది. షో కి తాను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు మీ పిలుపు మాత్రమే మిగిలి ఉన్నట్లు చరణ్ బాలయ్యతో చెప్పుకురావడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆహా టీం రామ్ చరణ్ తో పాటు కేటీఆర్ నీ తీసుకురావడానికి రెడీ కావడం జరిగిందట. దీంతో ఆహా టీం కేటీఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఈ సంక్రాంతికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే… చరణ్ కేటీఆర్ ఎపిసోడ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. గతంలో రాంచరణ్ నటించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చారు. మెగా ఫ్యామిలీతో కేటీఆర్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో చరణ్ ఎపిసోడ్ కోసం కేటీఆర్ నీ తీసుకొచ్చి స్పెషల్ ఎపిసోడ్ గా మార్చడానికి ఆహా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్.. కేటీఆర్ ఎపిసోడ్ “అన్ స్టాపబుల్” సీజన్ 2లో లాస్ట్ ఎపిసోడ్ అని ప్రచారం జరుగుతుంది.