రామ్‌చరణ్ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు అనగానే చేతిలో విల్లు, కాషాయ వస్త్రాలు, గడ్డం, మీసాలు, నెత్తిమీద కొప్పు… అంటూ మనకు కొన్ని ల్యాండ్ మార్కు గుర్తులున్నాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా వాటినే ఫాలో అవుతారా? లేకుంటే కొత్తగా ట్రెండ్‌ను సృష్టిస్తారా అనేది సర్వత్రా అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. వాటి సంగతి ఏమోగానీ, రామ్‌చరణ్ ఇప్పుడు ఎలా ఉన్నారనే దానిపై మాత్రం ఓ అవగాహన వచ్చేసింది. అదీ కియారా పుణ్యమా అని. కియారా అంటే రామ్‌చరణ్ సరసన వినయవిధేయ రామాలో నటించిన అమ్మాయి. ఇటీవల ఆమె పుట్టినరోజు పండుగ చేసుకుంది. ఈ పండుగకు రామ్‌చరణ్ కూడా హాజరయ్యారు. కాస్త లావు అయ్యీ అవ్వనట్టు, దిగిన మీసకట్టుతో ఉన్నారు. ఈ లుక్‌తో ఆయన కియారాతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ఆ ఫోజులు హల్చల్ చేస్తున్నాయి. చెర్రీ ఇప్పుడెలా ఉన్నారో అనే ఊహ నుంచి ఇప్పుడిలా ఉన్నారనే విషయం తెలిసింది. సో పుట్టినరోజున చెర్రీ గుట్టును ఇలా భయటపెట్టిందన్నమాట కియారా.
previous post
next post