Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పోలిటికల్ లీడర్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఆర్ఆర్ఆర్` సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా అలరించబోతోంది.
అలాగే శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో `ఆర్సీ 15` సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని చరణ్ పిక్ ఒకటి నెట్టింట లీకైంది.
ఈ పిక్‌లో గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని సైకిల్ తొక్కుతూ చరణ్ కనిపించాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆర్సీ 15లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. అందులో ఓ పాత్ర రాజకీయ నాయకుడైతే.. మరో పాత్ర ఐఏఎస్ అధికారి అని తెలుస్తోంది. అంతేకాదు, 1980లలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుండని.. ఈ ఎపిసోడ్లో చరణ్ ఓ పోలిటికల్ లీడర్‌గా కనిపిస్తాడని అంటున్నారు.
దానికి సంబంధించి ఫొటోనే తాజాగా లీకైందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, ఈ మూవీకి ఎస్.ఎస్.తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అలాగే `సర్కారోడు` అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.