Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ Ram Charan ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యూల్స్ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే.. కరోనా సృష్టించిన అల్లకల్లోలంతో సినిమా షూటింగ్ కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే గతేడాది జూలై 30నే విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత 2021 సంక్రాంతి డేట్ అనౌన్స్ చేశారు. అదీ మిస్ అయింది. ఇప్పుడు దసరాకు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే.. సెకండ్ వేవ్ కరోనా విజృంభణతో ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా డౌటే అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టుపై సందిగ్దం ఏర్పడింది.
ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేయాల్సి ఉంది. ఇండియన్ టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కే సినిమా ఈ జూన్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. శంకర్ కు భారతీయుడు2 సినిమా అడ్డంకిగా మారింది. ఈ చిత్ర నిర్మాతలు లైకా సంస్థ శంకర్ ను భారతీయుడు2 పూర్తి చేయకుండా మరో సినిమా చేయడానికి వీల్లేదంటున్నారు. ఈ విషయం మద్రాస్ హైకోర్టు వరకూ వెళ్లింది కూడా. పైగా.. శంకర్ హిందీలో రణవీర్ సింగ్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. దీంతో లైకా సంస్థకు సినిమా పూర్తి చేద్దామనే సంకేతాలే ఇచ్చారు శంకర్.
దీంతో ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా జూన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే.. భారతీయుడు పూర్తై, ప్రమోషన్లు, సినిమా విడుదలయ్యే వరకూ రామ్ చరణ్ తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండవు. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు గ్యాప్ ఎక్కువ పట్టొచ్చు. రామ్ చరణ్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉందని వార్తలు వచ్చాయి. శంకర్ సినిమా పూర్తయ్యాక ఆ సినిమా ఉండేలా ప్లాన్ చేశారని దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలూ లేట్ అవుతాయని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.