Ram Charan: ఇటీవలె రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని కంప్లీట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ లీకై నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
`సర్కారోడు` అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఈ మూవీకి ఫిక్స్ చేసినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో చరణ్ ఎలెక్షన్ కమీషనర్ గా, యస్.జె. సూర్య ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే వారి పాత్రలకు, సినిమా కథకు తగ్గట్టుగానే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. ఆ టైటిల్ పోస్టర్ రావాల్సిందే అని అంటున్నారు.