రాముడి నోట బాలయ్య డైలాగులు…

Share

వారం ముందే సంక్రాంతి సందడి మొదలైంది, ప్రతి సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచింది. దాదాపు అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్న సమయంలో ప్రతి చిత్ర యూనిట్, తమ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలో చెప్తూ, వ్యూవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇదే రేస్ లో ఫుల్ జోష్ లో ఉన్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చరణ్, మొదటిసారి బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న సినిమా వినయ విధేయ రామ.

ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయి, హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు అనుకుంటున్న వాళ్లకి చరణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. వినయ విధేయ రామ ఒక కంప్లీట్ బోయపాటి మార్క్ సినిమా అని, బాలయ్య స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయని, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమా ప్రధానమని చెప్పిన చరణ్… తనని తాను కొత్తగా చూసుకోవడానికి, అభిమానులకి తనని కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సినిమాని చేశానని, రంగస్థలం సినిమాలా కొత్తదనం ప్రయోగం కోరుకోకుండా, కంప్లీట్ ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి… బోయపాటి సినిమాలో చరణ్ నటిస్తే ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయమని చెప్పాడు.

చరణ్ ఇంతలా క్లారిటీ ఇవ్వడం సినిమాకి చాలా అవసరం, ఎందుకంటే రంగస్థలం తర్వాత వస్తున్న చిత్ర కావడం ప్రతి ప్రేక్షకుడు కొంతైనా కొత్తదనం కోరుకుంటాడు. అందులో తప్పు లేదు కానీ సినిమాలో తను కోరుకుంటున్న కొత్తదనం కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ కనిపించకపోతే ఆడియన్స్ అప్సెట్ అవుతారు. ఎంత పెద్ద సినిమా అయినా నెగటివ్ టాక్ లేదా డివైడ్ టాక్ తెచ్చుకునేది ఇక్కడే. స్వయంగా చరణ్ ఏ క్లారిటీ ఇచ్చాడు కాబట్టి మాస్ అభిమానులు… మెగా అభిమానులు… వినయ విధేయ సినిమాలో విధ్వంస రాముడిని చూడడానికి రెడీ అవ్వండి…


Share

Related posts

చిరంజీవి ఆఫీస్ ముందు ఉయ్యాల‌వాడ కుటుంబీకుల ఆందోళ‌న‌

Siva Prasad

రివ్యూ : అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ’ – డిస్నీ హాట్ స్టార్

siddhu

Parvati Nair New HD Wallpapers

Gallery Desk

Leave a Comment