Ram charan: ” మీ RRR సినిమా ఇప్పట్లో వస్తుందా అని రిపోర్టర్ ఎగతాళిగా అడిగితే ” రామ్ చరణ్ సూపర్ సమాధానం !

Share

Ram charan: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో చాలామందికి కామెడీ అయిపోయింది. అందుకు కారణం ఇప్పటికే నాలుగుసార్లు భారీ స్థాయిలో రిలీజ్ అని మేకర్స్ ప్రకటించి మళ్ళీ పరిస్థితుల కారణంగా వాయిదా వేయడమే. ఓ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోతే కామన్ ఆడియన్సే కామన్ సెన్స్ లేకుండా కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకు పోస్ట్ పోన్ అయింది… సమస్యలు ఎక్కడ వచ్చాయి అనే ఏ విషయాలను పట్టించుకోరు. పోనీ అలా వదిలేస్తారా అంటే అదీ లేదు. రివర్స్‌లో నెగిటివ్‌గా మాట్లాడటం.. కామెంట్స్ చేయడం ఓ పనిగా అయిపోతుంది. అలాంటిది రాం చరణ్, ఎన్ టి.ఆర్ సహా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్.

ram-charan-superb answer to reporters question
ram-charan-superb answer to reporters question

సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖ నటీ నటులు ..దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే ఎన్ని రాళ్ళు పడుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత డీవీవీ దానయ్య 500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి నిర్మించిన ఆర్ఆర్ఆర్ అధికారికంగా ప్రకటించిన జనవరి 7న గనక వచ్చి ఉంటే ఇప్పుడు అందరూ ఆ సినిమా సృష్ఠిస్తున్న సరికొత్త రికార్డుల గురించే మాట్లాడుకునే వారు. కానీ, కొత్త వేరియంట్ కరోనా ఒమైక్రాన్ వైరల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ప్రభాస్, పూజా హెగ్డేల రాధే శ్యామ్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

Ram charan: ఎప్పుడు రిలీజ్ చేయాలో వారే డిసైడ్ చేస్తారు.

అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా దిల్ రాజు అన్న కొడుకు హీరోగా పరిచయమవుతున్న రౌడీ బాయ్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు మీడియావారు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ గురించి ప్రస్తావించారు. దీనికి రాం చరణ్ సాలీడ్ ఆన్సర్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అందరం మూడున్న ఏళ్ళు కష్టపడ్డామని.. ఇలాంటి సినిమాను రిలీజ్ చేయాలంటే మంచి సమయం కావాలి. అందుకే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని
రాజమౌళి, నిర్మాత దానయ్య పోస్ట్ పోన్ చేశారని..ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా వారే డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు.


Share

Related posts

పూజా పాండే ఎఫ్‌బిలో బిజెపి నేతలు

Siva Prasad

Heroines: అవకాశాలు వచ్చే వరకు టాలీవుడ్..క్రేజ్ వచ్చాక బాలీవుడ్..స్టార్ హీరోయిన్స్ తీరేంటి ఇంత దారుణం

GRK

బిగ్ బాస్ 4 : మొదలు కాకముందే అతిపెద్ద లీక్ .. !!

GRK