Ram Charan Tej: “RRR” సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకి ఇటీవల ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పేరు మారుమొగుతుంది. అమెరికాలో ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత రాత్రి చరణ్ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చిరంజీవితో కలిసి చరణ్ భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా అభినందించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై రామ్ చరణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తాను అని తన మనసులో మాట బయటపెట్టారు.
చాలా విషయాలలో కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పుకోచ్చారు. క్రీడా నేపథ్యంలో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అయితే లుక్ పరంగా తాను విరాట్ కోహ్లీ కి దగ్గరలో ఉన్న ఛాయలు కనిపిస్తాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ పై విరాట్ కోహ్లీ రోల్ పోషించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో అడిగిన ప్రశ్నకు చెర్రీ సమాధానం ఇచ్చారు. ఇక ఇదే వేదికపై చరణ్ “నాటు నాటు” పాటకు స్టెప్పులు వేయడం జరిగింది. ఇక నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా “నాటు నాటు” సాంగ్ స్టెప్ లు వేశారు.
విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టులో… అతి తక్కువ సమయంలో అత్యధిక సెంచరీలు… పరుగులు చేసిన ఆటగాడిగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు విరాట్ కోహ్లీ సొంతమయ్యాయి. ఇండియా టీం లో సచిన్ నమోదు చేసిన చాలా రికార్డులు విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కోహ్లీ బయోపిక్ చెయ్యాలని ఉందని చరణ్ కామెంట్లు చేయటం సంచలనంగా మారింది.