Ram Charan Teja: స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమా..??

Share

Ram Charan Teja: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలావరకు మల్టీస్టారర్ సినిమా ప్రాజెక్టు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య, RRR సినిమాలు ఈ కోవకు చెందినవే. “ఆచార్య” లో చిరంజీవితో “RRR” లో ఎన్టీఆర్ తో చరణ్ నటిస్తున్నారు. రెండు సినిమాలు బయట పరిస్థితులు మారాక విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ప్రాజెక్టు ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్ మూవీ... అక్కడ ఈ రేంజ్‌ హీరోలు లేరా? | ram  charan next movie with prashanth neel arj

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “సలార్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేయటం మాత్రమే కాక ఎన్టీఆర్ సినిమా ఓకే చేయటం తెలిసిందే. ఇదే తరహాలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరిని కలిపి మల్టీస్టారర్ సినిమా చెయ్యాలని స్క్రిప్ట్ అంతా ఓకే చేయించుకున్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వస్తున్నాయి. డివివి దానయ్య ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయనున్నట్లు సమాచారం.

Read More: RRR: “RRR” కోసం “మగధీర” ప్లాన్ వేసిన రాజమౌళి..!!

అదే రీతిలో రామ్ చరణ్ తేజ్ కూడా రాజమౌళి శంకర్ సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మెగా కాంపౌండ్లో చాలావరకు మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిరంజీవి తో చరణ్ మాత్రమే కాక ఆ తర్వాత లూసిఫరు లో చిరంజీవితో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ మరోపక్క రానా తో చేస్తున్నారు. తాజాగా చరణ్ కొత్తగా మెగా కాంపౌండ్ కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవటం మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. 


Share

Related posts

ప్రభాస్ “రాధేశ్యామ్” సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు..!!

sekhar

ఇండియాలోకి అడుగుపెడుతున్న కొత్త బైకులు..! ఫీచర్లు చూస్తే కుర్రకారు అసలు ఆగలేరు..!!

bharani jella

Kajal Aggarwal : ఇండస్ట్రీ, అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన కాజల్ అగర్వాల్..!! 

sekhar