Ram Charan: జూన్ 11వ తారీకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వటం తెలిసిందే. 2012వ సంవత్సరంలో చరణ్ ఉపాసనకి పెళ్లి కావడం జరిగింది. పెళ్లయిన 11 సంవత్సరాలకు బిడ్డ పట్టడంతో మెగా కుటుంబంలో ఫుల్ సంతోషం నెలకొంది. ఉపాసన గర్భవతి అయిన సమయంలో చరణ్ RRR తో అంతర్జాతీయ స్థాయిలో రాణించటం తో పాటు మెగా కుటుంబంలో అనేక శుభకార్యాలు జరగడంతో.. మనవరాలు విషయంలో చిరంజీవి చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో నేడు బారసాల కార్యక్రమంలో పాపకు కొణిదెల క్లింకర (Konidela klin kaara) అనే పేరు పెట్టడం జరిగింది.
తాతయ్య చిరంజీవి, నానమ్మ సురేఖ ఈ పేరును చిన్నారి చెవిలో చెప్పారు. దీంతో పాప పేరు విషయంలో ఉత్కంఠ వేయడంతో ఈ కొణిదెల క్లింకర పేరును సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ బంగారు ఊయల గిఫ్ట్ ఇచ్చారంటూ దాని ధర కోటి రూపాయల వరకు ఉంటుందని వార్తలు రావడం జరిగింది. అయితే వస్తున్నా వార్తలు లో వాస్తవం లేదని రామ్ చరణ్ కి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు రెడీ చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకలో ఉపయోగించినట్లు ఉపాసన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. చేతితో తయారుచేసిన ఈ ఉయ్యాల బలం ఆశకు ప్రతీక. పరివర్తన మరియు ఆత్మ గౌరవాన్ని సూచిస్తుంది అంటూ ఉపాసన తన పోస్టులో పేర్కొంది.
పైగా బిడ్డ పుట్టిన గడియలు కూడా శుభముహూర్తమైన గడియలు.. కావటంతో పాటు.. ఆమె జాతకం కూడా దైవ బలం కలిగినది కావటంతో పాటు శ్రీరాముని జాతకంతో కూడినదని పండితులు తెలియజేస్తున్నారు. దీంతో ఈ మెగా ప్రిన్సెస్ కొణిదెల క్లింకార నీ చాలా లక్కీ గర్ల్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో నెల రోజులపాటు పాప దగ్గరే అన్ని తానే ఉండి.. చూసుకోవాలని షూటింగ్లకు చరణ్ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు.