RRR: దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు తెర పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ నేడు రిలీజ్ అయింది. సామాన్యులు మొదలుకొని ప్రముఖులు వరకు “ఆర్ఆర్ఆర్” చూడటానికి థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ భార్య ఉపాసన సైతం “ఆర్ఆర్ఆర్” నీ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూడటం జరిగింది. దీనిలో భాగంగా చరణ్ ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఉపాసన రచ్చరచ్చ చేసింది. పేపర్లు చంపుతూ వాటిని గాల్లోకి ఎగరేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది.
ముఖ్యంగా నాటు నాటు సాంగ్ వచ్చిన సమయంలో అభిమానులపై పేపర్లు జలి వాళ్లతో కలిసి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ఆర్ఆర్ఆర్” విడుదలైన దక్షిణాది నుండి నార్త్ వరకు అంత పాజిటివ్ టాక్ రావడంతో… సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటించగా… మిగతా పాత్రలలో ప్రముఖ నటులు నటించారు.
సినిమాలో ప్రతి ఫ్రేమ్ కళ్లు చెదిరే రీతిలో… జక్కన్న చిత్రీకరించాడని చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు. గ్యారెంటీగా బాహుబలి రికార్డులు “ఆర్ఆర్ఆర్” బ్రేక్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా నైజాం లో రికార్డు స్థాయి కలెక్షన్లు ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇదే తరుణంలో మెగా మరియు నందమూరి అభిమానులు.. థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తున్నారు. నాలుగేళ్ల కష్టానికి అద్భుతమైన ఫలితం వచ్చిందని చూసిన ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో.. మొదటి వారం రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చే టైం గ్యారెంటీ అని… విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో సినిమా యూనిట్ తో పాటు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!