Game Changer: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సినిమా సెలబ్రిటీలు చరణ్ కీ విషెస్ తెలియజేస్తున్నారు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ గా నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అంటూ.. పుత్రోత్సాహంతో.. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఈ సినిమాకి “గేమ్ చేంజర్” అనే టైటిల్ పెట్టినట్లు పేర్కొన్నారు. కాగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత “గేమ్ చేంజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
పోస్టర్ లో చరణ్ బ్లాక్ స్పెట్స్ తో మంచి రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. బైక్ మీద కూర్చుని ఉన్న ఈ పోస్టర్..లో టైటిల్ తో పాటు చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ పోస్టర్ పై రామ్ చరణ్.. స్పందించి..నేను ఇలాంటి బెస్ట్ బర్తడే గిఫ్ట్…ను అడగలేదు థాంక్యూ శంకర్ సార్ అని ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చేసింది. పైగా టైటిల్ “గేమ్ చేంజర్” చాలా వెరైటీగా ఉండటంతో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా పోస్టర్ బట్టి చూస్తే స్టూడెంట్ పాత్రలో చరణ్ నటించినట్లు తెలుస్తోంది. మరొకటి కలెక్టర్ పాత్ర అని ఇంకొకటి .. పెద్ద తరహాలో ఉండే పాత్ర అని అంటున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీ. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “RRR”తో ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.