29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: పిల్లల విషయంలో అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు..!!

Share

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. “RRR” ఆస్కార్ పోటీలో ఉండటంతో ఈ నెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కావటంతో అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు. చరణ్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరికివారు అమెరికాలో పలు ఇంటర్వ్యూలలో… పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చరణ్ లేటెస్ట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాసనతో పెళ్లి సంవత్సరాలు అయింది. పిల్లల విషయంలో దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఎదురుచూస్తూ ఉన్నాము.. అని చరణ్ తెలియజేశారు. వ్యక్తిగత జీవితం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ మీరు త్వరలో నాన్న కాబోతున్నట్లు విన్నాము. ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా.. “చాలా సంతోషంగా ఉంది”…అంటూ చరణ్ సమాధానం ఇవ్వడం జరిగింది.

Ram Charan's key comments in an interview in America regarding children

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో ఘనంగా వైభవంగా జరిగింది. అప్పటి నుంచి మెగా ఫ్యామీలీ కోడలిగా, మహిళా వ్యాపారవేత్తగా పలువురి మన్ననలు పొందుతూ సత్తా చాటుతోంది ఉపాసన. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. రామ్ చరణ్ హీరోగా 2007వ సంవత్సరంలో “చిరుత” సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో “మగధీర” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అనంతరం చరణ్ పెళ్లి చేసుకోవడం జరిగింది.

Ram Charan's key comments in an interview in America regarding children

అయితే పెళ్లి జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు చరణ్ తండ్రీ కావడంతో… మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈనెల 27వ తారీకు చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో శంకర్ సినిమాకి సంబంధించి టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నరు.


Share

Related posts

రాజ్ కందుకూరి కుమారుడు శివ… మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం

Siva Prasad

గంగవ్వ కంటే ముందు బిగ్ బాస్ హౌస్ లోని మరొక లేడీ ఇల్లు కొంటోంది. ఎవరో చుడండి…

Naina

Kajal Aggarwal Amazing Looks

Gallery Desk