NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ పై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు..!!

Share

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టైం నడుస్తోంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలు చేస్తూ మెగా అభిమానులను కాలర్ ఎగరేసేలా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చెర్రీ దానికి తగ్గ రీతిలోనే విజయాలు అందుకుంటున్నాడు. “RRR” సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోవటం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కావడం జరిగింది. చరణ్ ఉపాసన 2012వ సంవత్సరం జూన్ 14వ తారీకు పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి చేసుకున్న ఈ పెళ్లి అప్పట్లో అంగరంగ వైభవంగా జరిగింది.

Ram Charan's key comments on wife Upasana's pregnancy

ఇదిలా ఉంటే ఎప్పటినుండో జ్వరం తండ్రి కావాలని కుటుంబ సభ్యులతో పాటు మేఘాభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మీడియా ఇంకా వెబ్ మీడియా ఇంటర్వ్యూలలో చాలా సందర్భాలలో చరణ్ అదేవిధంగా ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించి అనేక ప్రశ్నలు కూడా ఎదుర్కోవటం జరిగింది. అయితే తాజాగా చరణ్ తండ్రి కాబోతున్నట్లు ఉపాసన ప్రెగ్నెంట్ అని చిరంజీవి గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రకటించడం జరిగింది. అయితే ఉపాసన ప్రెగ్నెన్సీపై శ్రీనగర్ లో జరిగిన జీ20 సదస్సులో చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది.

Ram Charan's key comments on wife Upasana's pregnancy

ఈ మ్యాజిక్ అంతా జపాన్ లోనే జరిగింది. గతంలో నాకు యూరప్ ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు జపాన్ ఇష్టమైన ప్రాంతంగా మారింది. నా మనసులో జపాన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది”…అని అన్నారు. కాగా g20 సదస్సులో పాల్గొన్న తొలి నటుడిగా చెర్రీ నిలిచారు. కాగా ప్రస్తుతం చరణ్… శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Share

Related posts

ప్ర‌ముఖ ఓటీటీకి `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`.. విడుద‌లైన నెల‌లోపే స్ట్రీమింగ్‌!?

kavya N

అక్షయ్ కుమార్ ..అమీర్ ఖాన్ తర్వాత మహేష్ బాబు.. అమెరికా వెళుతుంది అందుకేనా .. ఇది ఫ్యాన్స్ కి నిజంగా షాకే..?

GRK

క్లీన్ హిట్‌గా `కార్తికేయ 2`..ప్ర‌భాస్ కు థ్యాంక్స్ చెప్పిన‌ నిఖిల్!

kavya N