29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: ఆ హాలీవుడ్ హీరోయిన్ కనిపిస్తే కళ్ళు అర్పకుండా చూస్తా రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు అంతకుమించి అన్న తరహాలో సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు. ఎక్కడా కూడా గర్వం లేకుండా వచ్చిన ప్రతి సినిమాకి తగిన న్యాయం చేస్తూ… నటనలో విశ్వరూపం చూపిస్తున్నాడు. తనకు తగ్గ పాత్రలు ఎంచుకొని.. అభిమానులను అలరిస్తున్నాడు. డాన్స్ మరియు ఫైట్స్ ఇంకా అన్ని విభాగాలలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.

Ram Charan's sensational comments if that Hollywood heroine appears

ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నటన మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. ఇటీవలే “RRR” అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అమెరికాలో మొన్నటిదాకా జక్కన్న మరియు రాజమౌళి కుటుంబాలతో చరణ్ సందడి చేయడం జరిగింది. ఆ సమయంలో అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్లతో RRR టీం కలవడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హాలీవుడ్ హీరోయిన్ పై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ తన ఫస్ట్ క్రష్ అని స్పష్టం చేయడం జరిగింది.

Ram Charan's sensational comments if that Hollywood heroine appears

ఆమె కనిపిస్తే కల్లారపకుండా చూస్తానని చెప్పుకొచ్చారు. ఆమె తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలియజేశారు. “ప్రెట్టి ఉమెన్” అనే సినిమా నుంచి జూలీయాకు పెద్ద అభిమానిని… అని వివరించడం జరిగింది. అలాగే కేథరిన్ జీటా జోన్స్ కూడా ఇష్టమని స్పష్టం చేశారు. “ది మాస్క్ ఆఫ్ జోరో” అనే సినిమాలో ఆమె నటన చూసి చాలా ఎంజాయ్ చేశానని చరణ్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా.


Share

Related posts

మరో ఆరెంజ్ చూసినట్లు ఉంది…

Siva Prasad

Pawan Trivikram: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ ఆగమేఘాలమీద త్రివిక్రమ్..??

sekhar

Prabhas: ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయితే మాత్రం అంత ఖర్చు చేయాలా? 20 నిమిషాల కోసం రూ.75 కోట్లా?

Ram