Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 2013వ సంవత్సరంలో “జంజీర్” అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో పాటు రామ్ చరణ్ పై బాలీవుడ్ మీడియా నెగిటివ్ ప్రచారం చేయటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది “RRR” తో అదిరిపోయే విజయాన్ని చరణ్ అందుకోవటం తెలిసిందే. సినిమాలో చెర్రీ చేసిన రామ రాజు పాత్ర హైలెట్ కావటం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు చరణ్ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో “జంజీర్” టైంలో ఎటకారం చేసిన బాలీవుడ్ మీడియా..”RRR”లో చరణ్ పెర్ఫార్మెన్స్ పట్ల భారీ ఎత్తున పొగడ్తల వర్షం కురిపించటం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బాలీవుడ్ ప్రేక్షకులు చరణ్ కి బ్రహ్మరథం పట్టడం జరిగింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకునే దిశగా.. చరణ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండోసారి ఎంట్రీ ఇవ్వడానికి సరికొత్త స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. దీనికోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హెల్ప్ తీసుకుంటున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే ఒక మాస్ సబ్జెక్ట్.. ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో.. సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ చేయడానికి చరణ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సల్మాన్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. గతంలోనే “జంజీర్” టైంలో సల్మాన్.. చరణ్ ని బాగా సపోర్ట్ చేయటం జరిగింది.
చిరంజీవి కుటుంబంతో సల్మాన్ కి మంచి బాండింగ్ ఉంది. అందువల్ల ఇటీవల చిరంజీవి నటిస్తున్న “గాడ్ ఫాదర్” సినిమాలో నటించడానికి సల్మాన్ ఓకే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న చరణ్ కు హెల్ప్ చేయడానికి సల్మాన్ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు అయిన తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ పై చరణ్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!