వివాదాలతోనే ఎక్కువ సమయం గడిపే రామ్‌గోపాల్‌వర్మ మరో కొత్త వివాదానికి తెరతీశారు. ఇటీవల విడుదైలెన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి రిలీజ్‌కి ముందు రిలీజ్ తర్వాత కూడా అనేక చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూనే తన కొత్త సినిమాను ప్రకటించేశాడు వర్మ. తెలంగాణ రాష్త్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను రూపొందించబోతున్నానని, ఆ సినిమా పేరు `టైగర్ కేసీఆర్` అని ఎనౌన్స్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. అంతేకాదు, వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్, కూతురు కవిత, హరీష్‌రావు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబునాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, రామోజీరావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించారు వర్మ.
previous post
next post