సినిమా

వర్మ అన్నగారిని చూపించాడు

Share

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత, ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, కుటుంబాన్నే కాదని రామారావు ఆమెని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఎదురుకున్న సంఘర్షణ ఎలాంటిది? అనే అంశాన్ని కథగా తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు సృష్టించింది. ఇప్పటికే వర్మకి కావాల్సిన పబ్లిసిటీని తెచ్చిపెట్టిన రెండు పాటలు విమర్శల పాలవగా, తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. రామారావు వర్ధంతి రోజున, ఎన్టీఆర్ ఎలైవ్ అంటూ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఈ చిన్న టీజర్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. కేవలం ఒక కుర్చీలో కూర్చొని కళ్ళుమూసుకున్నట్లు ఉన్న ఎన్టీఆర్, నెమ్మదిగా కళ్లు తెరిచి చూడడంతో ముగిసింది. అన్నగారు చివరి రోజుల్లో ఎలా ఉన్నాడో, అదే లుక్ ని దించడంలో సక్సస్ అయిన వర్మ… ఆ ఆర్టిస్ట్ ఎవరూ అనేది మాత్రం రివీల్ చేయలేదు. మరో నెల రోజుల్లో బాలకృష్ణ-క్రిష్ కలయికలో ఎన్టీఆర్ బయోపిక్ నుంచి పార్ట్ మహానాయకుడు రాబోతోంది. ఈ సినిమా విడుదల కన్నా ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని రిలీజ్ చేసి బాలయ్యకి, చంద్రబాబుకి భారీ షాక్ ఇవ్వాలని ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నాడు.


Share

Related posts

Samantha: సమంతని చాలా తక్కువ అంచనా వేశాము నాయనో.. ఏం చేసిందో చూడండి!

Ram

సీబీఐ వేట… రియా చక్రవర్తికి ఇక చుక్కలే…!!

sekhar

Anu Emmanuel New Wallpapers

Gallery Desk

Leave a Comment