25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Avatar 2: “అవతార్ 2” విజువల్ వండర్ పై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్..!!

Share

Avatar 2: ప్రపంచ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన “అవతార్ 2” అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 2009వ సంవత్సరంలో వచ్చిన “అవతార్” సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచ సినీ ప్రేమికులను ఎంతగానో అల్లరిస్తూ కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో… ఆరు భాషలలో రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ కావటం జరిగింది. అవసరాల శ్రీనివాస్.. “అవతార్ 2” తెలుగు వర్షన్ కి మాటలు, డైలాగులు అందించారు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ టైటిల్ రూపంలో సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ఊహ లోకం ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.

Ram Gopal Varma Sensational Comments on Avatar 2 Visual Wonder
Avatar 2

ప్రపంచవ్యాప్తంగా దర్శకులు సినిమాలు చేస్తారు. జేమ్స్ కామెరూన్ మాత్రం ప్రపంచాలు సృష్టిస్తారు అని ఆడియోన్స్ అంటున్నారు. కుటుంబ సెంటిమెంటుతో పాటు విజువల్ వండర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో త్రీడీలో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందు… టెలిగ్రామ్ యాప్ లో విడుదలైన గాని… కలెక్షన్లకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. “అవతార్ 2″లో ప్రతి సన్నివేశం మనసును కట్టిపడేసేలా ఉందని పేర్కొన్నాడు.

Ram Gopal Varma Sensational Comments on Avatar 2 Visual Wonder
Ram Gopal Varma

యాక్షన్ సన్నివేశాలతో సినిమా సాగిందని..పేర్కొన్నాడు. దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే.. జేమ్స్ కామెరూన్ పండోరా అనే అద్భుత ప్రపంచాన్ని క్రియేట్ చేశారని ప్రశంసించారు. “అవతార్ 2” చూసిన తర్వాత స్వర్గం అంటే పండోరా వలే ఉంటుందని ఎవరైనా మాటిస్తే మనుషులందరూ చనిపోతారని కీలక వ్యాఖ్యలు ఆర్జీవి చేయడం జరిగింది. మూడువేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా….₹1120 కోట్ల(గ్రాస్) వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఇండియాలోనే ₹52.5కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో కచ్చితంగా.. లాభాలు రావటం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Monal Gajjar Amazing Images

Gallery Desk

Waltair Veerayya: “వాల్తేరు వీరయ్య” మూవీ హైలెట్స్ చెప్పేసిన డైరెక్టర్ బాబి..!!

sekhar

పూరి జగన్నాథ్ పై వచ్చిన ఆ వార్తలు ఫేక్ క్లారిటీ ఇచ్చిన చార్మి..!!

sekhar