RGV: నేడు అంతర్జాతీయ మదర్స్ డే అన్న సంగతి తెలిసిందే. దీంతో అందరూ తమ తల్లితో మదర్స్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తల్లిపై తమకు ఉన్న ప్రేమను తెలుపుతూ విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే ఖరీదైన గిఫ్ట్‌లను ప్రజెంట్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం తన తల్లికి విషెస్ తెలిపారు.
కానీ, వర్మలా మరెవ్వరూ అమ్మకు విషెస్ చెప్పుండరేమో. ఎప్పుడూ వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా `హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి` అంటూ తల్లితో కలిసి దిగిన అపూర్వమైన ఫోటోను ట్విటర్లో పంచుకున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఈ ట్విట్ కాస్త వైరల్‌గా మారింది. మొత్తానికి ఎవరి మీద ప్రేమ లేదు, అందరికీ నేను దూరమే అంటూ ఎప్పుడూ చెప్పే వర్మ.. తల్లిపై ప్రేమను మాత్రం దాచలేకపోయాడు. దీంతో నెటిజన్లు మీలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఫీలింగ్స్ లేవంటావ్.. నువ్వు కూడా విషెస్ చెబుతావా, ఎంత పెద్ద ఎదవైనా అమ్మ ముందు పసివాడే అంటూ రకరకరాల కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి ఎవరేమన్నా పట్టించుకోని వర్మ.. ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడీయన లెస్బియన్ స్టోరీతో తెరకెక్కించిన `డేంజరస్` మూవీ విడుదలకు సిద్ధం ఉంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా వర్మ చేతిలో ఉన్నాయి.
Happy Mother’s Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy
— Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022