RGV: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్‌బాస్.. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరో సీజన్ ప్రారంభం కావడానికి ముందే.. ఈ రియాలిటీ షో `బిగ్‌బాస్ నాన్‌స్టాప్` పేరుతో ఓటీటీలో సందడి చేస్తోంది. డిస్నీ ప్లాస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ బిగ్‌బాస్ శనివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.
కొత్త, పాత కంటెస్టెంట్ల కలయికతో ప్రారంభమైన ఈ షోకు కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గంట ఎపిసోడ్‌లా కాకుండా 24 గంటలు ఏం జరుగుతుందో చూపిస్తూ.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఓటీటీ బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్‌కు తాజాగా మద్దతు ప్రకటించాడు.
ఇంతకీ ఆర్జీవీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. శ్రీరాపాక. ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. ముఖ్యంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన `నగ్నం` మూవీతో శ్రీరాపాక బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఓటీటీ బిగ్‌బాస్‌లోకి ప్రవేసించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఆమెకు వర్మ తన సపోర్ట్‌ను తెలుపుతూ ఆల్‌ద బెస్ట్ వీడియోను ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
దీంతో అరియానా, అషూలకు షాక్ తగిలినట్టైంది. బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి వీరిద్దరూ వర్మకు బాగా క్లోజ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అరియానా, అషూలలో ఒకరికి వర్మ ఈ సారి మద్దతు ఇస్తారని అనుకుంటారు. కానీ, ఆయన అనూహ్యంగా శ్రీరాపాకకు సపోర్ట్‌గా నిలిచారు.