ఎనర్జిటిక్ స్టార్‌గా పేరున్న రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌ను చేస్తానని పూరి ప్రకటించాడు. మరి సీక్వెల్‌ను రామ్‌తోనే చేస్తాడా? అనే సంగతి తెలియడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం తమిళంలో విజయవంతమైన తాండన్ సినిమా రీమేక్ హక్కులను స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నాడట. మరి ఈ సినిమా రీమేక్‌లో రామ్ నటిస్తాడా? లేక మరేవరైనా నటిస్తారా? అని తెలియడం లేదు. అయితే దాదాపు రామ్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు నెటివిటీకి తగినట్లు మార్చే అవకాశాలున్నాయా? అని చర్చలు మాత్రం జోరుగానే జరుగుతున్నాయట.
previous post
next post