వచ్చే ఏడాది హిట్ ఇస్తాం

జనవరి నుంచి ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరీ జగన్నాథ్ సినిమా రెగ్యులర్ షూటింగ్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో సినిమా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. హీరోలను స్టైలిష్ గా చూపిస్తూనే డైనమిక్ రోల్స్ తో వాళ్ళ ఇమేజ్ ను మార్చేస్తుంటారు పూరీ జగన్నాథ్. ఇప్పుడు రామ్ తో కూడా ఇదే చేయబోతున్నారు పూరీ జగన్నాథ్. ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయారు రామ్. పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరీ టూరింగ్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి మే లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
నటీనటులు:
రామ్ పోతినేని
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: పూరీ జగన్నాథ్
నిర్మాణ సంస్థ: పూరీ టూరింగ్ టాకీస్
సమర్పణ: లావణ్య
నిర్మాతలు: పూరీ కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ & ఛార్మి కౌర్)