Harish Shankar: టాలీవుడ్ అందగాడు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూనే మరో పక్క తమిళ దర్శకులతో కూడా సినిమాలు షురూ చేస్తున్నాడు. రామ్ అంటేనే ఎనర్జీకి పెట్టింది పేరు. ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత చేయబోయే సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామితో ది వారియర్ అనే సినిమా చేస్తున్న రామ్ ఆ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గబ్బర్ సింగ్ దర్శకుడితో రామ్?
లింగుస్వామి తరువాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా చేసేందుకు రామ్ సిద్ధపడతాడు. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి రామ్ పోతినేని కోసం ఫైనల్ స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే విధంగా మరో మాస్ దర్శకుడితో కూడా చర్చలు నెరుపుతున్నట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి విజయం తర్వాత భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న హరీష్ శంకర్ అని సమాచారం.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బాలీవుడ్లో హరీష్ శంకర్?
అయితే దర్శకుడు హరీష్ శంకర్ కూడా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చాలా బిజీగా ఉండడంతో ప్రాజెక్టు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక ఇంతలోపు భవదియుడు భగత్ సినిమాలు పూర్తి చేసుకుని హరీష్ శంకర్ రామ్ పోతినేనితో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే రెండు మూడు సార్లు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.