Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో రెండు భారీ విజయాలు సాధించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరియర్ లోనే ఈ రెండు సినిమాలు భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “అఖండ” అనే మూడో సినిమా వస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి.. బాలకృష్ణ లో సరికొత్త కోణాన్ని చూపించాడు బోయపాటి.
నందమూరి అభిమానులకు సినిమా టీజర్ విపరీతంగా నచ్చటం మాత్రమే కాక సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది “అఖండ”. కచ్చితంగా హ్యాట్రిక్.. బాలయ్యతో బోయపాటి కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బోయపాటి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ వినిపించటం జరిగిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ 2019 సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అదిరిపోయే మాస్ హిట్ అందుకని ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రామ్ తో బోయపాటి ఒక మాస్ స్టోరీ నేపథ్యం కలిగిన స్క్రిప్ట్ రెడీ చేసినట్లు, చాలా డిఫరెంట్ యాంగిల్ లో.. రామ్ నీ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది అని వార్తలు వస్తున్నాయి. మరోపక్క “జాతిరత్నాలు” మూవీ డైరెక్టర్ అనుదీప్ తో కూడా రామ్ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.