న్యూస్ సినిమా

Ram Pothineni: ‘ది వారియర్’ బుల్లెట్ సాంగ్ వచ్చేసింది…ఇలాంటి పాటే కదా రామ్ కి కావల్సింది..

Share

Ram Pothineni: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాసీవ్ హిట్ అందుకున్నాడు. దాంతో ఇక క్లాస్ సినిమాలను కాస్త తగ్గించి పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెడ్ సినిమాను చేశాడు. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా నిర్మాత ను మాత్రం సేఫ్‌గా బయటపడేసింది. ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ సినిమా ది వారియర్. మొదటిసారి రామ్ తమిళంలో చేస్తున్న స్ట్రైట్ సినిమా ఇది.

ram-pothineni-the warrior bullet song is released
ram-pothineni-the warrior bullet song is released

కోలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు ఎన్.లింగుస్వామీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని తెలుగు, తమిళంలో రూపొందుతోంది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయినా ది వారియర్ సినిమా నుంచి తాజాగా బుల్లెట్ సాంగ్ రిలీజైంది. ఈ లిరికల్ సాంగ్‌ను తమిళ స్టార్ హీరో శింబు పాడటం విశేషం. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ తన మార్క్ స్టైల్లో కంపోజ్ చేసిన మాస్ బీట్ సాంగ్ ఇది. తెలుగు, తమిళ వెర్షన్స్‌లో శింబు పాడిన ఈ పాట రిలీజై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Ram Pothineni: థియేటర్స్‌లో రచ్చ చేసేలాగే ఉంది బుల్లెట్ సాంగ్.

రామ్ ఎనర్జీకి తగ్గట్టు రాక్ స్టార్ ట్యూన్ కంపోజ్ చేశాడు. ఇక కృతిశెట్టి రామ్ సరసన ఎంతో హుషారుగా స్టెప్స్ వేసింది. కేవలం లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇక ఈ ఫుల్ సాంగ్ వీడియోకు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ గ్యారెంటీగా థియేటర్స్‌లో రచ్చ చేసేలాగే తాజాగా వచ్చిన బుల్లెట్ సాంగ్ ఉంది. కాగా, ఈ సినిమాను జూలై 14న విడుదల చేయనున్నారు. ఆదిపినిశెట్టి ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


Share

Related posts

మోదీకి జ‌గ‌న్ షాక్‌…క‌ల‌లో కూడా ఊహించ‌లేదేమో!

sridhar

TDP Janasena BJP: బిజేపీ చేతికి తాళం ..! టీడీపీ లో పెద్ద భయం ఇదే..!

Srinivas Manem

Electric Bikes : లేటెస్ట్ ఫీచర్స్ తో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ అదుర్స్..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar