RAM : వరుస ఫ్లాపుల్లో వున్న రామ్ 2019 వ సంవత్సరం లో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో హిట్ ట్రాక్ లో పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన రామ్..చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ నేపథ్యం కలిగిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా చేసి తనలో కొత్త కోణాన్ని బయటపెట్టిన అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రాకముందు రామ్ నటించిన మాస్ సినిమా అనేసరికి కచ్చితంగా గుర్తుకు వచ్చేది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “జగడం”. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యింది.
RAM : “జగడం” సినిమా రీమేక్
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇటీవల 15 సంవత్సరాలు కావటంతో..డైరెక్టర్ సుకుమార్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మేటర్ లోకి వెళ్తే మళ్లీ “జగడం” ఈ సినిమాని రీమేక్ చేసే తరహాలో సుకుమార్ ఆలోచన చేస్తున్నట్లు దానికి..స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ మంచి హిట్ ట్రాక్ లో ఉండటంతో ..కచ్చితంగా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతుందని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే రామ్ జగడం స్క్రిప్ట్ పై కూర్చున్న బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ తెలుగు మరియు తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు, ఈ సినిమా తర్వాత “జగడం” రీమేక్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినబడుతోంది.