అదిరిపోయే డాన్స్ తో రచ్చ లేపారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి, వాటిని మరింత పెంచుతూ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ప్రొమోషన్స్ నుంచి రామ లవ్స్ సీత వీడియో సాంగ్ బయటకి వచ్చింది. చరణ్ డాన్స్, కియారా గ్లామర్, కలర్ఫుల్ సెట్ అన్నీ కలిసి ఈ సాంగ్ ని అందరినీ ఆకట్టుకునేలా చేసింది.