Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా.. రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా రిలీజ్ అవుతుండటంతో… సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్(Charan), ఎన్టీఆర్(NTR), రాజమౌళి(Rajamouli) చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమములో ఇటీవలే ముంబైలో “ఆర్ఆర్ఆర్” ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇక ఇదే సమయంలో వరుస ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీకి సంబంధించి.. బిజీబిజీగా గడిపిన చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ఓ పేరుగాంచిన షోలో పాల్గొన్నారు. ఆ షోలో హోస్ట్…. ఎన్టీఆర్,చరణ్, డైరెక్టర్ రాజమౌళి ని పలు ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలన్నిటిలో రామ్ చరణ్ ని అడిగిన ప్రశ్నలు హైలెట్ గా నిలిచాయి. హోస్ట్.. చరణ్ ని ఉద్దేశించి.. మీకు బయట హోటల్స్ హాస్పిటల్స్ అదేవిధంగా ఎయిర్ లైన్స్ ఉన్నాగాని సినిమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి రామ్ చరణ్ సమాధానమిస్తూ.. హోటల్స్, హాస్పిటల్స్, ఎయిర్ లైన్స్.. ఉన్నంత మాత్రాన ఈ షో లోకి రాలేదు సినిమాలు చేయడం వల్లే వచ్చాము. అందువల్లే సినిమాలు చేస్తున్నాను అంటూ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.
మీ ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు మీరంతా కలిసి భోజనం చేస్తున్న సమయంలో గేటు బయట ఫ్యాన్ ఒకరు వెయిట్ చేస్తున్నారు..? అని వాచ్ మెన్ వచ్చి చెబితే మీ రియాక్షన్ ఏంటి..? అంటే ఒక అభిమాని మాత్రమే కాదు దర్శకుడు వచ్చినా నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఎవరు అభిమాని వచ్చాడో.. అంటూ సమాధానమిచ్చాడు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంత మాత్రమే కాక ఎన్టీఆర్ తో అంతకుముందు సినిమా చేసే అవకాశం రాలేదా అని ప్రశ్నించాను దానికి ఎన్టీఆర్ సమాధానమిస్తూ… ఇంత బడ్జెట్ పెట్టే నిర్మాత అప్పట్లో దొరకలేదు.. అందుకే కుదరలేదు అంటూ సరిగ్గా సమాధానం ఇచ్చాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!