29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: చిరంజీవి అవార్డ్స్ గురించి రాంచరణ్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 40 సంవత్సరాల చిరంజీవి సినిమా కెరియర్ లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన తనయుడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ రీతిలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తూ ఉన్నాడు. RRR సినిమాతో ఊహించని పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా సంపాదించాడు. ఇదిలా ఉంటే “RRR” లోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ అమెరికాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరికివారు వరుస ఇంటర్వ్యూలు వేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ టాక్‌ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్‌ సామ్‌ ఫ్రాగోసోతో మాట్లాడారు తన తండ్రి గురించి చెబుతూ ఎంతగానో మురిసిపోయాడు.

Ramcharan's Sensational Comments About Chiranjeevi Awards

తన తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయినప్పటికీ… ఆయన నీడలో తాము పెరగకూడదని.. ఆయన ఎంతగానో కోరుకున్నారు. ఈ క్రమంలో మాకంటూ సొంత గుర్తింపు ఉండాలని… ఆయన అభిలాషించారు. దీంతో నాన్న తన స్టార్ డాం పిల్లలపై పడకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. ఈ క్రమంలో సినిమాలపరంగా వచ్చే అవార్డులు మరియు ప్రశంశాల పత్రాలు… ఇంటిలో ఉండకుండా వాటన్నిటినీ తన ఆఫీసులో పెట్టుకున్నారని చరణ్ తెలియజేశారు. ఒకవేళ ఇంటిలో ఆ అవార్డులు చూసి ఆయన ఒక గొప్ప స్టార్ అనే భావన పిల్లలలో కలుగుతుందేమో అన్న భావనతో ఆయన ముందు జాగ్రత్తగా… అవార్డులను ఇంట్లో పెట్టలేదని చరణ్ తెలియజేశారు. దీంతో స్టార్ కిడ్స్ గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెరిగినట్లు స్పష్టం చేశారు.

Ramcharan's Sensational Comments About Chiranjeevi Awards

అంతేకాదు తన తండ్రి ఇండస్ట్రీలో తాను ఒక పెద్ద హీరో అని చెప్పుకునే రకం కాదని అన్నారు. ఇండస్ట్రీలో నాన్న పెద్ద హీరో అయినప్పటికీ.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే విషయంలో.. ఈజీగా అడుగు పెట్టవచ్చని ఎప్పుడు అనుకోలేదు. ఆ రీతిగా పెంచడం వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చరణ్ స్పష్టం చేశారు. అంతేకాదు నాన్న పెంచిన పెంపకం కారణంగా..ఈ రోజు నా EMI లు నేనే కొట్టుకోగలుగుతున్నాను. ఇది కేవలం తన తండ్రి పెంపకం వల్లే సాధ్యం.. అంటూ తండ్రి చిరంజీవి గురించి అమెరికాలో ప్రముఖ ఇంటర్వ్యూలో చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

28 ఏళ్ల త‌ర్వాత ….

Siva Prasad

తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాడా?

Siva Prasad

గన్ లైసెన్స్ అప్లై చేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..!!

sekhar