RGV: ఇటీవల “అలయ్ బలయ్” కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సరిగ్గా ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి రావటంతో సభ ప్రాంగణం మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఈ క్రమంలో వేదికపై చిరంజీవి రాగానే ఒక్కసారిగా ఆయనతో సెల్ఫీలు దిగటానికి ఎగబడ్డారు. దీంతో ప్రసంగిస్తున్న గరికపాటి అసహనానికి లోనయ్యారు. వెంటనే ఫోటో సెషన్ ఆపేయాలని మైకులో అరవటం జరిగింది. అదే సమయంలో చిరంజీవి గారు.. మీరు ఫోటోలు దిగటం ఆపేయాలి. లేకపోతే నేను మైక్ విడిచి వెళ్ళిపోతాను.. నువ్వు ఆపుతావా లేకపోతే నన్ను వెళ్లిపోమంటావా..? గరికపాటి మైక్ లో అరిచేశారు.
చిరంజీవి గారికి నా విజ్ఞప్తి మీరు ఫొటో సెషన్ ఆపేసి.. నా వైపు రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగాస్టార్ పై గరికపాటి అందరి ముందు.. విమర్శలు చేయటంపై సినిమా ఇండస్ట్రీలో చాలామంది మండిపడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు .. గరికపాటి చేసిన వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత “గాడ్ ఫాదర్” సక్సెస్ మీట్ లో మరి కొంతమంది గరికపాటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కాగా లేటెస్ట్ గా డైరెక్టర్ ఆర్జీవి .. చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలకు తమదైన శైలిలో ట్విటర్ లో మండిపడ్డారు. “చిరంజీవిని అవమానించిన ఆయన్ను క్షమించే ప్రసక్తే లేదు. మా అభిమానుల దృష్టిలో చిరుని అవమానించినవాడు… గడ్డిపరకతో సమానం. గరికపాటి బుల్లి ప్రవచనాల్లో నక్కీ నక్కి దాక్కో. పబ్లిసిటీ కోసం ఇండస్ట్రీపై మొరగవద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు. నువ్వేంటో నీకు తెలివి ఉందని అనుకుంటావు..కాబట్టి, నువ్వే తెలుసుకొ అని ట్విట్టర్ లో ఆర్జీవి ట్వీట్ చేయడం జరిగింది,