The Warrior Teaser: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తెరకెక్కించిన తాజా చిత్రం `ది వారియర్`. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ్ భాషట్లో అట్టహాసంగా విడుదల కానుంది.
అయితే మే 15న రామ్ బర్త్‌డే సందర్భంగా ఒకే రోజు ముందుగానే మేకర్స్ ఆయన ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కొద్ది సేపటి క్రీతమే బయటకు వదిలారు. `ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నామప్పా, ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్లు.. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తున్నారు.. ఈ మధ్య సత్య అనే ఒకడు వచ్చినాడు.. ఒడియమ్మా` అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం అలరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సత్య అనే పోలీస్ ఆఫీసర్ గా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో రామ్ అదరగొట్టేశాడు. `పాన్ ఇండియా సినిమాలు చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూశారా?` అంటూ రామ్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయించింది. రామ్‌ను లవ్‌లోకి దింపే అమ్మాయిగా కృతి శెట్టి నటిస్తే.. మాస్ విలన్‌గా ఆది ఆకట్టుకున్నాడు. టీజర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊరమాస్ అంతే.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. పైగా రామ్ పోలీస్ పాత్రలో నటించడం ఇదే తొలిసారి కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా, ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే అక్షర గౌడ, నదియా తదితరులు కీలక పాత్రలను పోషించారు.