‘బాహుబలి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యాక్టర్ రానా కాస్త గ్యాప్ తీసుకుని నటిస్తోన్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ఈసినిమా షూటింగ్ రానా ఫుల్ బిజీగా ఉన్నారు. శనివారం రానా పుట్టిన రోజు సందర్భంగా ‘విరాట పర్వం’ సినిమాకు సంబంధించి ఇన్టెన్ లుక్‌ను విడుదల చేశారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఈ లుక్‌లో రానా ముఖానికి ఎర్రటి గుడ్డను కట్టుకుని ఉన్నారు. రానా నక్సలైట్‌గా కనపడతారని, పోలీస్ ఆఫీసర్‌గా కనపడతారని ఆయన పాత్రపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. ‘రెవల్యూషన్ ఈజ్ ఎన్ యాక్షన్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాలో ఉన్న ఇన్‌టెన్స్‌ను పోస్టర్లో ఎలివేట్ చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
previous post
next post