Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క హీరోతో స్నేహంగా ఉంటూ అన్ని భాషలలో నటిస్తూ సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో రానా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. విలన్ పాత్రలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా “బాహుబలి” సినిమాలో బల్లాలదేవ పాత్రలో రానా నటనకు దేశం మొత్తం ప్రశంసించింది. హీరో రానాకి మంచి గుర్తింపు తీసుకు రావడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్”(Bheemla Naayak) సినిమాలో కూడా ప్రాణా నెగటివ్ రోల్ చేయడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్(Bollywood) కింగ్ ఖాన్ షారుక్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో “జవాన్” అనే సినిమా చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో నయనతార ఇంకా దీపికా పదుకొనే నటిస్తుండగా విలన్ పాత్రలో రానా నటిస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ స్టార్ హీరో సినిమా నుండి అనుకోని కారణాలవల్ల రానా తప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతుంది. కొత్త విలన్ కోసం సినిమా యూనిట్ వెతుకులాట స్టార్ట్ చేసినట్లు సమాచారం.
ఇటీవలే “జవాన్”(Jawaan) సినిమాకి సంబంధించి చిన్న పార్టీ వీడియో అందులో షారుక్ మొఖం నిండా గుడ్డలు కట్టడం.. చాలా వింతగా కనిపించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. చాలా కొత్తగా షారుక్ ఖాన్ నీ అట్లీ చూపిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన టీజర్ లో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా షారుక్ తన ఇమేజ్ కి తగ్గ హిట్ కొట్టలేకపోవడం జరిగింది. దీంతో షారుక్ అప్ కమింగ్ సినిమాలు జవాన్, పఠాన్ లపై అభిమానులకు బోలెడన్ని అంచనాలు పెట్టుకోవడం జరిగింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!