సినిమా

KGF 3: “కేజిఎఫ్ 3” విలన్ పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో..??

Share

KGF 3: “కేజిఎఫ్” ఫస్ట్ చాప్టర్ ఎంత పెద్ద హిట్ అయిందో.. సెకండ్ చాప్టర్ దానికి మించి విజయం సాధించడం తెలిసిందే. దేశంలోనే అతి చిన్న ఇండస్ట్రీ అని పిలవబడే కన్నడ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకర్స్ దృష్టి మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు తిరిగేలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అదే రీతిలో…హీరో యాష్ తమదైన శైలిలో రాణించారు. సినిమాల్లో టేకింగ్.. చిత్రీకరించిన విధానం తో పాటు చూసే ప్రేక్షకుడిని ఒక వింత ప్రపంచం లోకి తీసుకెళ్లి మాదిరిగా… డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పనితనం అందరినీ ఆకట్టుకుంది.

rana Played villan role in kgf 3 movie

దీంతో ఇండియాలో రాజమౌళి తర్వాత టాప్ దర్శకుల లిస్టు ప్రకారం మనోడి పేరు మారుమ్రోగుతోంది. దీంతో కేజిఎఫ్ 3 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా మూడో చాప్టర్ ఉంటుందని “కేజిఎఫ్ 2” క్లైమాక్స్ లో హింట్ ఇవ్వటంతో… చాప్టర్ 3 కి సంబంధించి ఎటువంటి వార్త వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా కేజిఎఫ్ 3 విలన్ కి సంబంధించి ఓ వార్త.. ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతోంది.

 

మేటర్ లోకి వెళ్తే “కేజిఎఫ్” సెకండ్ చాప్టర్ లో విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించడం సినిమాకు హైలెట్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో మూడు చాప్టర్ లో దగ్గుబాటి రానా నీ తీసుకునే ఆలోచనలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నట్లు టాక్. ఇప్పటికే విలన్ పాత్రకు సంబంధించి రానాతో చర్చించినట్లు రానా కూడా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. కేజిఎఫ్ కి ఉన్న క్రేజ్ బట్టి రానా ఓకే అన్నట్టు.. ఇదే సమయంలో బాహుబలి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు .. ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

రష్మిక మందన్న మాజీ లవర్ తో ముచ్చటపడుతుందా..?

GRK

Sakshi Agarwal Recent Photos

Gallery Desk

ఈ ఇద్దరు హీరోయిన్ లలో ఒకరు ప్రభాస్ పక్కన.. ఇద్దరూ అద్దిరిపోయారు.. ఫాన్స్ ఏమంటారో..!

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar