Sai Pallavi: ఎట్టకేలకు రానా నటించిన సినిమా ‘విరాట పర్వం’ సినిమా రిలీజు కాబోతుంది. అయినా ఈ సినిమా పైన ప్రేక్షకులు చాలా ఇంటరెస్ట్ కలిగి వున్నారు. దానికి కారణం ఒకే ఒక్కరు. అది మరెవరో కాదు, ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి ‘సాయి పల్లవి.’ అవును.. ప్రస్తుతం మన టాలీవుడ్లో ఒక హోరోకి వున్న స్టార్ డం మరో హీరోయిన్ కి వుంది అంటే అది మన సాయి పల్లవినే. హీరోయిన్ అంటేనే సక్సెస్ కావాలి, లేదా గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండాలి అని ఒక ఫార్ములా వున్న ఈ రోజుల్లో గ్లామర్ తో సంబంధం లేకుండా టాలెంట్ తో అగ్రహీరోయిన్ గా కొనసాగుతున్నారు మన సాయి పల్లవి.
ముఖ్యంగా ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకోవాలి. సాయి పల్లవి పేరు వింటే మన తెలుగు యువత పిచ్చెక్కేలా అరుస్తారు. అంతలా ఆమెని ఇక్కడ ఆరాధిస్తున్నారు. సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడింది. అదే ఇపుడు సాయి పల్లవి నుంచి రాబోతున్న విరాటపర్వం సినిమాకు పెద్దగా హైప్ అయింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయినా ఇపుడు ఈ సినిమా రిలీజు అంటే మనవాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.
సినిమా విడుదల లేట్ అయిన కారణంగా సినిమా బాగారాలేదని, రీషూట్స్ జరిగాయని, ఓ క్రమంలో ఈ సినిమా OTTలో విడుదల చేయబోతున్నారు అని కూడా అనుకున్నారు. అయితే అలాంటి రూమర్లకు చెక్ పెడుతూ ఇపుడు సినిమా పెద్ద ఎత్తున రిలీజు కాబోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో సాయి పల్లవి క్రేజ్ కూడా తగ్గిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయిందో ఒక్కసారిగా ఈ సినిమా పై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. సమంతతో పాటు చాలామంది హీరోయిన్స్ కూడా విరాటపర్వంలో సాయి పల్లవి నటన చూసి ఫిదా అవుతున్నారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…