స్నేహితుడు విశాల్ కోసం రానా దగ్గుబాటి ఓ కొత్త అవతారం ఎత్తాడు. ఇంతకు విశాల్ కోసం రానా ఏం చేశాడో తెలుసా? పాట పాడాడు. అవును నిజమే! ఈ విషయాన్ని విశాల్ స్వయంగా తెలియజేశాడు. `లైట్స్, కెమెరా, యాక్షన్..` అంటూ సాగే ఈ పాటను తెలుగులో రానా పాడటం విశేషం. రానా రికార్డింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ ట్విట్టర్లో పోస్టూ చేస్తూ “రానా తొలిసారి పాట పాడారు. అద్భుతంగా పాడారు“ మెసేజ్ కూడా పెట్టారు. దీనిపై రానా స్పందిస్తూ “నువ్వు లేకుంటే ఈ సాహసం చేసేవాడిని కాను“ అంటూ రిప్లయ్ ఇచ్చారు. విశాల్, తమన్నాలతో సుందర్.సి తెరకెక్కించిన `యాక్షన్` చిత్రం నవంబర్ 15న విడుదలవుతుంది.
previous post
next post